జనారణ్యంలోకి ఏనుగులు... పంటపొలాల ధ్వంసం!

  • చిత్తూరు జిల్లాలో బీభత్సం 
  • వరి, అరటి, మామిడి పంటలు నాశనం 
  • ఆందోళన చెందుతున్న రైతులు

అటవీ ప్రాంతం తరిగిపోతుండడం, ఉన్నా సరైన ఆహారం లభించకపోవడంతో మూగజీవాలు జనారణ్యంలోకి వస్తున్నాయి. ఆకలి దప్పికలు తీర్చుకునేందుకు ఊళ్ల పైనా, పంటపొలాల పైనా పడుతున్నాయి. కొన్నాళ్ల క్రితం శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలను తీవ్రంగా వణికించిన ఏనుగుల గుంపు నుంచి ఇప్పుడిప్పుడే ఉపశమనం లభించిందని రైతులు సంతోషిస్తున్న సమయంలో చిత్తూరు జిల్లాను ప్రస్తుతం సమస్య చుట్టుముట్టింది.

 బంగారంపాలెం మండలం పరిధిలోని పలు గ్రామాల పంటపొలాలపైకి ఏనుగుల గుంపుదాడి మొదలు పెట్టింది. అరటి, మామిడి, వరి పంటలను ధ్వంసం చేస్తుండడంతో రైతులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. మొత్తం ఏడు ఏనుగుల గుంపు పంటలను తీవ్రంగా నాశనం చేస్తుండడంతో రైతులు బెంబేలెత్తిపోతున్నారు. సమస్య నుంచి బయటపడే మార్గం లేక సాయం కోసం ప్రభుత్వం వైపు చూస్తున్నారు. 



More Telugu News