తెలుగు తమ్ముళ్లకు ఇదే నా సూచన: ఐవైఆర్ కృష్ణారావు ఆగ్రహం
- హిందూ ధర్మానికి హాని జరుగుతుందని బాధపడిపోతున్నారు
- ట్వీట్లు పెట్టి నన్ను ట్యాగ్ చేస్తున్నారు
- ఇమామ్ పాస్టర్లకు వేతనాలు రాజ్యాంగ విరుద్ధమని హైకోర్టులో కేసు
- మీరు ఈ కేసులో ఇంప్లీడ్ అయి గట్టి న్యాయవాదిని పెట్టండి
పలు విషయాలపై ట్వీట్లు పెట్టి తనను ట్యాగ్ చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు మండిపడ్డారు. 'ఎప్పుడూ లేని విధంగా హిందూ ధర్మానికి హాని జరుగుతుందని బాధపడిపోతూ ట్వీట్లు పెట్టి నన్ను ట్యాగ్ చేస్తున్న తెలుగు తమ్ముళ్లకు సూచన. ఇమామ్, పాస్టర్లకు వేతనాలు రాజ్యాంగ విరుద్ధమని హైకోర్టులో డబ్ల్యూపీ (పిల్) నం 152/2019 ద్వారా సుధీష్ రాంభొట్ల గారు కేసు వేశారు. అది రేపు విచారణకు వస్తున్నది' అని తెలిపారు.
'మీరు ఈ కేసులో ఇంప్లీడ్ అయి గట్టి న్యాయవాదిని పెట్టండి. ట్వీట్లు పెట్టి నన్ను టాగ్ చేసే దానికన్నా ఫలితం ఉంటుంది. అదే విధంగా త్వరలో జెరూసలేంయాత్ర సహాయం, చర్చిలకు ప్రభుత్వ ధనం ఇవ్వటం మీద కూడా కోర్టులో కేసు వేస్తున్నాం. దానిలో మీరు చేరవచ్చు. ఆసక్తి ఉంటే తెలియజేయండి వివరాలు ఇస్తాను' అని ఐవైఆర్ కృష్ణారావు సూచించారు.