మంత్రి సత్యవతి రాథోడ్ వర్సెస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్..సమీక్ష సమావేశంలో తీవ్ర వాగ్వివాదం
- మహబూబాబాద్ కలెక్టరేట్‌లో సమీక్ష సమావేశం
- తాను లేకుండా సమావేశం ఎలా నిర్వహిస్తారని ఎమ్మెల్యే నిలదీత
- తానేం ఎర్రబస్సు ఎక్కి రాలేదని ఆగ్రహం
తెలంగాణ మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే శంకర్ నాయక్ మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. మహబూబాబాద్ కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానిక ఎమ్మెల్యే రాకుండా సమావేశం ఎలా నిర్వహిస్తారంటూ మంత్రి సత్యవతి రాథోడ్, అధికారులను శంకర్ నాయక్ ప్రశ్నించారు.
తానేం ఎర్రబస్సు ఎక్కి రాలేదంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సమీక్ష సమావేశాలు ఫొటోలు దిగడానికి మాత్రమే పరిమితం అవుతున్నాయని మండిపడ్డారు. స్థానిక సమస్యలు ఏంటనేవి స్థానిక ఎమ్మెల్యేకు మాత్రమే తెలుస్తాయని, అలాంటిది ఆయన రాకుండానే సమావేశం ఎలా నిర్వహిస్తారని నిలదీశారు. దీంతో జోక్యం చేసుకున్న కలెక్టర్ సమాచార లోపం వల్లే ఇలా జరిగిందని, క్షమించాలని కోరారు. అయినప్పటికీ శంకర్ నాయక్ వినిపించుకోలేదు.