ఒప్పిస్తాం కానీ.. వెనక్కి తగ్గబోం: కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్
- సీఏఏ అమలు విషయంలో వెనక్కి తగ్గబోం
- వారికి పౌరసత్వం ఎందుకివ్వకూడదో చెప్పాలని డిమాండ్
- నిద్ర నటిస్తున్న వారిని లేపడం కష్టమని వ్యాఖ్య
పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తేల్చిచెప్పారు. ఆదాయ పన్ను అప్పిలేట్ ట్రైబ్యునల్ సర్క్యూట్ ప్రారంభోత్సవంలో నిన్న పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. సీఏఏను వ్యతిరేకిస్తున్న వారిని ఒప్పించే ప్రయత్నం చేస్తాం తప్పితే అమలు విషయంలో వెనక్కి తగ్గే ఉద్దేశం ఎంతమాత్రమూ లేదన్నారు.
పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్‌లలో మతపరమైన హింసకు గురై మన దేశానికి వలస వచ్చిన వారికి పౌరసత్వం ఎందుకు ఇవ్వకూడదో చెప్పాలని డిమాండ్ చేశారు. భారతదేశ విలక్షణమే అన్ని మతాల కలయిక అని పేర్కొన్న రవిశంకర్ ప్రసాద్.. నిద్రపోయే వాళ్లను లేపొచ్చు కానీ, నటించేవారిని లేపడం ఎవరి తరమూ కాదని సీఏఏను వ్యతిరేకించే వారిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.