నేటి సాయంత్రంలోగా కేవైసీ ఇవ్వకుంటే అకౌంట్లు బంద్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
- సమర్పించని ఖాతాదారులకు సేవలు రద్దు
- వెంటనే సంబంధిత శాఖ వద్దకు వెళ్లాలని వినతి
- బ్యాంకు మెసేజ్ లను స్పామ్ గా భావిస్తున్న కస్టమర్లు
నేటి సాయంత్రంలోగా కేవైసీ (నో యువర్ కస్టమర్) సమర్పించకుంటే, వారి బ్యాంకు అకౌంట్లను నిలిపివేస్తామని ప్రభుత్వ రంగ బ్యాకింగ్ దిగ్గజం ఎస్బీఐ షాకింగ్ న్యూస్ చెప్పింది. అసంపూర్తిగా కేవైసీ పత్రాలను ఇచ్చిన వారు వెంటనే బ్యాంకు శాఖ వద్దకు రావాలని, తద్వారా లావాదేవీల్లో అసౌకర్యాన్ని నివారించుకోవచ్చని బహిరంగ నోటీసులు జారీ చేసింది.
కేవైసీ అసంపూర్తిగా ఉన్న వారికి తరచూ మెసేజ్ లు, ఈ మెయిల్స్ పంపామని బ్యాంకు ఉన్నతాధికారులు వెల్లడించారు. కాగా, చాలా మంది ఖాతాదారులు బ్యాంకు పంపుతున్న మెసేజ్ లను స్పామ్ గా భావిస్తున్నట్టు తెలుస్తోంది. వీటిని నిర్లక్ష్యం చేయకుండా అధికారులు అడిగిన సమాచారాన్ని తక్షణం అందించాలని బ్యాంకింగ్ నిపుణులు సూచిస్తున్నారు.
యూజర్ కు నెట్ బ్యాకింగ్ యాక్సెస్ ఉంటే, ఆన్ లైన్ మాధ్యమంగా కూడా పత్రాలను అప్ డేట్ చేసుకోవచ్చని తెలిపారు. ఖాతాదారుడు తమ గుర్తింపు ధ్రువీకరణగా ఓటర్ ఐడీ పాస్ పోర్టు, టెలిఫోన్ బిల్, డ్రైవింగ్ లైసెన్స్, ఫోటో ఉన్న బ్యాంక్ కార్డు, ఆధార్ తదితరాలను సమర్పించవచ్చని వెల్లడించారు.