నా కెరీర్ లో ఇప్పటివరకు ఇలాంటి క్యారెక్టర్ పడలేదు: సునీల్
- ప్రతినాయక పాత్రలు కూడా పోషిస్తున్న సునీల్
- 'కలర్ ఫొటో' చిత్రంలో విలన్ రోల్
- సునీల్ లుక్ ను సోషల్ మీడియాలో పంచుకున్న చిత్రబృందం
కమెడియన్ నుంచి హీరోగా మారి, మళ్లీ కామెడీ పాత్రలు పోషిస్తున్న సునీల్ ఇప్పుడు విలన్ పాత్రలకూ సై అంటున్నాడు. ఇటీవల రవితేజ 'డిస్కోరాజా'లో నెగెటివ్ రోల్ పోషించినా అది ఆశించిన ఫలితాన్నివ్వలేదు. ఇప్పుడు సందీప్ రాజ్ డైరెక్షన్ లో సుహాస్ హీరోగా వస్తున్న 'కలర్ ఫొటో' చిత్రంలో కూడా సునీల్ విలన్ క్యారెక్టర్ చేస్తున్నాడు. తాజాగా సునీల్ బర్త్ డే సందర్భంగా 'కలర్ ఫొటో' యూనిట్ స్పందించింది. ఈ చిత్రంలో సునీల్ లుక్ ను సోషల్ మీడియాలో పంచుకుంది.
దీనిపై సునీల్ స్పందిస్తూ 'కలర్ ఫొటో' యూనిట్ కు థ్యాంక్స్ చెప్పారు. ఈ సినిమాలో తన పాత్ర పేరు రామరాజు అని, తన కెరీర్ మొత్తం గుర్తుండిపోయేలా ఈ క్యారెక్టర్ ఉంటుందని సునీల్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సరికొత్త పాత్రలో తనను చూస్తే ప్రేక్షకులు తప్పకుండా థ్రిల్లవుతారని పేర్కొన్నారు.