బుర్ర ఎంతగా వేడెక్కిందో... క్రిస్ లిన్ తలనుంచి పొగలు... వీడియో ఇదిగో!
- పాకిస్థాన్ సూపర్ లీగ్ లో ఘటన
- 15 బంతుల్లో 30 పరుగులు చేసి అవుట్
- పెవీలియన్ కు వెళుతుంటే పొగలు
క్రిస్ లిన్... సమకాలీన క్రికెట్ ప్రపంచంలో ఆస్ట్రేలియా ఆటగాడిగా పరిచయం అక్కర్లేని ఆటగాడు. బంతి బంతికీ అభిమానులకు ఎంతో థ్రిల్ ను కలిగించే ఈ గేమ్, మైదానంలో ఆడేవారిలో ఎంత హీట్ ను పుట్టిస్తుందో, వారి బుర్రలు ఎలా హీటెక్కుతాయో తెలిపేందుకు ఇదో ఉదాహరణ.
తాజాగా, పాకిస్థాన్ సూపర్ లీగ్ మ్యాచ్ లో క్రిస్ లిన్ తల నుంచి పొగలు వచ్చాయి. వర్షం కారణంగా ఓ మ్యాచ్ ని 12 ఓవర్లకు కుదించగా, క్రిస్ లిన్ ఆడుతున్న లాహోర్ కలందర్స్ జట్టు ముందు భారీ లక్ష్యం కనిపిస్తోంది. లక్ష్యాన్ని ఛేదించే దిశగా, ధాటిగా ఆడుతున్న లిన్ 15 బంతుల్లో 30 పరుగులు చేశాడు.
ఆ సమయంలో మరో షాట్ కు ప్రయత్నించి, అవుట్ అయ్యాడు. ఎంతో అసంతృప్తితో గ్రౌండ్ ను వీడి వెళుతూ, తలపై ఉన్న హెల్మెట్ ను తీశాడు. అంతే... అతని తలపై పొగలు వస్తూ కనిపించింది. ఇదేమీ గ్రాఫిక్స్ కాదండోయ్... అతనిలోని టెన్షన్ తలను అంత వేడెక్కించిందన మాట. నెట్టింట వైరల్ అవుతున్న వీడియోను మీరూ చూడవచ్చు.