శివసేన అధికార పత్రిక సామ్నా ఎడిటర్‌గా రశ్మీఠాక్రే

  • భార్యకు కొత్త బాధ్యతలు అప్పగించిన మహారాష్ట్ర సీఎం
  • సీఎం అయ్యాక ఎడిటర్‌ బాధ్యతల నుంచి తప్పుకున్న ఉద్ధవ్‌
  • దీంతో ఈరోజు ఆ బాధ్యతలు స్వీకరించిన రశ్మీ
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే శివసేన అధికారిక పత్రిక ‘సామ్నా’ ఎడిటర్‌ బాధ్యతలను తన భార్య రశ్మీ ఠాక్రేకు అప్పగించారు. మూడు నెలల క్రితం ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఉద్ధవ్‌ ఠాక్రే గత ఏడాది నవంబరు 28వ తేదీన ఎడిటర్‌ బాధ్యత నుంచి తప్పుకున్నారు. దీంతో ఖాళీ అయిన ఆ స్థానంలో తన భార్యనే నియమించుకున్నారు. దీంతో ఈరోజు రశ్మీ ఠాక్రే ఎడిటర్‌గా బాధ్యతలు స్వీకరించారు. శివసేన వాయిస్‌ వినిపించాలన్న లక్ష్యంతో పార్టీ వ్యవస్థాపకుడు బాల్‌ ఠాక్రే 1989లో ఈ పత్రికను తీసుకువచ్చారు. రాష్ట్రంలో బీజేపీతో పొత్తు ఉన్న సమయంలో కూడా ప్రభుత్వ విధానాలను సామ్నా ఎండగట్టేది. పత్రికకు కార్యనిర్వాహక ఎడిటర్‌గా శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ కొనసాగుతున్నారు.


More Telugu News