ఊళ్లోకి వచ్చిన ఎలుగుబంటి.. పరుగులు తీసిన జనం

  • తెలంగాణలోని జనగామ జిల్లా గోవర్ధనగిరిలో కలకలం
  • అటవీ ప్రాంతంలోకి పంపేసిన స్థానికులు
  • తరచూ ఇలాగే ఎలుగు బంట్లు వస్తుంటాయని వెల్లడి
తెలంగాణలోని రఘునాథపల్లి మండలం గోవర్ధనగిరి గ్రామంలో ఉదయమే ఏదో పనికంటూ బయటికి వెళ్లినవారు, బయటికెళ్లి ఊరిలోకి తిరిగివస్తున్నవారు.. ఉన్నట్టుండి పరుగులు తీయడం మొదలుపెట్టారు. పక్కనే ఉన్న సందుల్లోకి, తెలిసినవారి ఇళ్లలోకి వెళ్లి దాక్కున్నారు.  దీనికి కారణం ఓ ఎలుగు బంటి. పక్కనే ఉన్న అటవీ ప్రాంతం లోంచి వచ్చిన ఓ ఎలుగు బంటి దర్జాగా గ్రామంలో తిరగడం మొదలుపెట్టింది. ఊర్లోని బడి సమీపంలో చెట్ల కింద మొదట కనిపించింది. అది చూసినవారు అరుస్తూ ఉండటంతో అటూ ఇటూ పరుగెత్తింది.

వెంటపడి తరిమికొట్టారు

ఎలుగుబంటి ఊరిలో తిరుగుతుండటంతో అందరూ భయాందోళనకు గురయ్యారు. ఎక్కడివారక్కడే ఇళ్లలోకి వెళ్లిపోయారు. విషయం తెలిసిన కొందరు యువకులు కర్రలు పట్టుకుని ఎలుగుబంటి వెంటపడ్డారు. ఊరి చివరన ఉన్న అటవీ ప్రాంతం వైపు తరిమికొట్టారు. అయితే ఎలుగుబంటి వచ్చిన విషయం తెలిసిన రైతులు పొలాలవైపు వెళ్లేందుకు భయపడ్డారు. కర్రలు, ఇతర ఆయుధాల వంటివి తీసుకుని వెళ్లారు.



More Telugu News