రూ. 10 వేల టికెట్ దర్శనంపై అసంతృప్తి వ్యక్తం చేసిన అంబికా కృష్ణ!

  • శ్రీవాణి పథకం కింద ప్రత్యేక దర్శనం
  • హారతి దర్శనం కల్పించడం లేదని విమర్శలు
  • రెండు నెలల క్రితం మొదలైన కొత్త పథకం
తిరుమలలో శ్రీవాణి పథకం కింద 10 వేల రూపాయలు పెట్టి టికెట్ కొనుగోలు చేసి వెళ్లినప్పటికీ, సాధారణ దర్శనాన్ని మాత్రమే కల్పిస్తున్నారని ప్రముఖ పారిశ్రామికవేత్త, సినీ నిర్మాత అంబికా కృష్ణ అసంతృప్తిని వ్యక్తం చేశారు. అంత డబ్బిచ్చి దర్శనానికి వెళ్లే భక్తులకు, టీటీడీ అధికారులు దర్శనం కల్పిస్తున్న విధానం సరిగ్గా లేదని ఆయన అభిప్రాయపడ్డారు.

 భక్తులకు సాధారణ దర్శనాన్ని మాత్రమే కల్పిస్తున్నారని ఆరోపించిన ఆయన, హారతి దర్శనం కల్పించాలని కోరారు. కాగా, ఎప్పుడు తాను తిరుమలకు వెళ్లానన్న విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు. రెండు నెలల క్రితం టీటీడీ ఈ పథకాన్ని అమలులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా రూ. 10 వేలు పెట్టి టికెట్ కొన్న భక్తుడికి వీఐపీ దర్శనాన్ని కల్పిస్తారు. అయితే, కేవలం దర్శనాన్ని మాత్రమే కల్పిస్తున్నారని, స్వామి వారికి హారతిని కూడా ఇవ్వాలని, దేవుని ముందే తీర్థం, శటారి సౌకర్యాన్ని కల్పించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.


More Telugu News