తిరుమలలో గణనీయంగా తగ్గిన రద్దీ!

  • వెలవెలబోతున్న ఏడుకొండలు
  • ఒకే ఒక్క కంపార్టుమెంట్ లో భక్తులు
  • నిన్న స్వామిని దర్శించుకున్న 70 వేల మంది
తిరుమల గిరులపై భక్తుల రద్దీ గణనీయంగా తగ్గింది. దీంతో ఏడుకొండలూ వెలవెల బోతున్నాయి. ఈ ఉదయం స్వామివారి సర్వదర్శనానికి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ఒక్క కంపార్టుమెంట్ లో భక్తులు వేచి చూస్తున్నారు. అన్ని రకాల దర్శనాలూ 2 నుంచి మూడు గంటల సమయంలోనే పూర్తవుతున్నాయని టీటీడీ అధికారులు వెల్లడించారు. సోమవారం నాడు స్వామి వారిని 69,096 మంది భక్తులు దర్శించుకున్నారు. హుండీ ద్వారా సుమారు రెండున్నర కోట్ల రూపాయలకు పైగా ఆదాయం లభించింది. ఈ నెలాఖరు వరకూ వారాంతాలు మినహా, తిరుమలలో రద్దీ సాధారణంగానే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.


More Telugu News