పశ్చిమ గోదావరిలో ఘోర దుర్ఘటన.. కాల్వలోకి దూసుకెళ్లిన కారు.. ముగ్గురి దుర్మరణం
- కారులో రాజమహేంద్రవరం వెళ్తుండగా ఘటన
- కారును బయటికి తీసిన అగ్నిమాపక సిబ్బంది
- డ్రైవర్ నిద్రమత్తే కారణమని ప్రాథమిక నిర్ధారణ
పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలంలో ఈ తెల్లవారుజామున ఘోర దుర్ఘటన జరిగింది. జగన్నాథపురం వద్ద ఓ కారు అదుపుతప్పి కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
యలమంచిలి మండలం కాజ గ్రామానికి చెందిన బాధితులు నరసాపురం మండలంలోని మచ్చపురి నుంచి రాజమహేంద్రవరం వెళ్తుండగా కారు అదుపుతప్పి నరసాపురం కాల్వలోకి దూసుకెళ్లింది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. పోలీసులు, స్థానికుల సాయంతో కారును బయటికి తీశారు. డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.