గాంధీ ఆసుపత్రిలో నిండిపోయిన కరోనా ఐసొలేషన్ వార్డ్

  • తెలంగాణలో అంతకంతకూ పెరుగుతున్న కరోనా అనుమానిత కేసులు
  • గాంధీ ఆసుపత్రి ఐసొలేషన్ వార్డులో అందుబాటులో 40 పడకలు 
  • గత 40 గంటల వ్యవధిలో గాంధీకి వచ్చిన 50 కేసులు
తెలంగాణలో కరోనా వైరస్ అనుమానిత కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. దీంతో, హైదరాబాదులోని గాంధీ ఆసుపత్రికి భారీ సంఖ్యలో అనుమానిత కేసులు వస్తున్నాయి. ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఐసొలేషన్ వార్డులో కేవలం 40 పడకలు మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం ఈ వార్డు మొత్తం నిండిపోయింది. గత 40 గంటల వ్యవధిలో 50 అనుమానిత కేసులు గాంధీ ఆసుపత్రికి వచ్చాయి. ఈ నేపథ్యంలో, బెడ్ల కొరత ఏర్పడింది. దీంతో, పెయిడ్ రూమ్స్ ను కూడా ఐసొలేషన్ కోసం వినియోగిస్తున్నారు.


More Telugu News