పబ్‌లో దాడిపై పోలీస్ స్టేషన్‌లో రాహుల్ సిప్లిగంజ్ ఫిర్యాదు
- పోలీసులకు ఆలస్యంగా ఫిర్యాదు
- తనపై ఎందుకు దాడి చేశారన్న విషయంపై వివరణ
- పబ్‌లో లభించిన వీడియో దృశ్యాల ఆధారంగా ఇప్పటికే దర్యాప్తు
తెలుగు బిగ్‌బాస్-3 విజేత రాహుల్ సిప్లిగంజ్‌పై హైదరాబాద్‌లోని ఓ పబ్‌లో బీరు బాటిళ్లతో దాడి జరిగిన విషయం తెలిసిందే. అయితే, ఆయన గానీ, ఆయన తల్లిదండ్రులు కానీ పోలీసులకు ఇప్పటికీ ఫిర్యాదు చేయకపోవడం చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. కాగా, కొద్దిసేపటి క్రితం గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌కు రాహుల్ వచ్చాడు.
పబ్బులో తనపై జరిగిన దాగి ఘటనపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనపై ఎందుకు దాడి చేశారన్న విషయాన్ని ఆయన పోలీసులకు వివరిస్తున్నాడు. తనతో పాటు, మహిళల పట్ల కొందరు అసభ్యంగా ప్రవర్తించారని, దాడి చేశారని ఆయన చెప్పినట్లు తెలిసింది.
ఇదిలా ఉంచితే, గాయపడ్డ తర్వాత రాహుల్.. ఆసుపత్రిలో చికిత్స తీసుకుని ఇంటికి వెళ్లిపోయాడని అంతకు ముందు పోలీసులు మీడియాకు తెలిపారు. ఈ విషయంపై ఇప్పటికే పబ్ యాజమాన్యం ఫిర్యాదు చేసిందని వివరించారు. పబ్‌లో లభించిన వీడియో దృశ్యాల ఆధారంగా తాము ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించామని చెప్పారు.