కంబోడియా నుంచి వచ్చిన కుప్పం యువకులకు కరోనా వైరస్ లేదు: వైద్యుల స్పష్టీకరణ
- గత నెలలో ఆ దేశం నుంచి వచ్చిన ఏడుగురు
- వారు కరోనా బాధితులంటూ ప్రచారం
- అప్రమత్తమైన వైద్యాధికారులు
కరోనా వైరస్ పుణ్యమా అని విదేశాల నుంచి ఎవరు వచ్చినా అనుమానంగా చూడడం ఎక్కువైంది. ఇక మనుషుల ఆరోగ్యం కాస్త తేడాగా కనిపిస్తే ఇక అంతే సంగతులు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం పరిధిలోని రెండు గ్రామాల్లో ఏడుగురు కరోనా బాధితులు ఉన్నారన్న వార్త కూడా ఇటువంటిదే.
నియోజకవర్గం పరిధిలోని మల్లనూరు, అడవిబుదుగురు గ్రామాలకు చెందిన ఏడుగురు యువకులు కంబోడియాలో ఉంటున్నారు. గత నెలలో వీరు అక్కడి నుంచి స్వగ్రామాలకు చేరుకున్నారు. వీరికి కరోనా వైరస్ సోకిందంటూ ప్రచారం జరగడంతో ఒక్కసారిగా రెండు గ్రామాల్లో కలకలం మొదలయ్యింది. దీంతో అప్రమత్తమైన అధికారులు వారికి వైద్య పరీక్షలు నిర్వహించి ఎటువంటి వైరస్ సోకలేదని తేల్చడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.