మేం విడిపోయింది బీజేపీ నుంచే.. హిందూత్వం నుంచి కాదు: ఉద్ధవ్ థాకరే

  • అయోధ్యను సందర్శించిన ఉద్ధవ్
  • రాముడి ఆశీర్వాదం కోసమేనని వ్యాఖ్య
  • రామ మందిర నిర్మాణంలో శివసేన కీలకపాత్ర
మహారాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఉద్ధవ్ థాకరే తొలిసారి నిన్న ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాము విడిపోయింది బీజేపీ నుంచే కానీ.. హిందూత్వం నుంచి కాదని స్పష్టం చేశారు. రాముడి ఆశీర్వాదం తీసుకునేందుకే అయోధ్యను సందర్శించినట్టు చెప్పారు. తానిక్కడికి రావడం ఏడాదిలో మూడోసారని వివరించారు. హిందూత్వం పేరుతో గిమ్మిక్కులు చేయాల్సిన అవసరం తమకు లేదని శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ పేర్కొన్నారు. అయోధ్య రామమందిర నిర్మాణంలో శివసేన కీలక పాత్ర పోషిస్తుందన్నారు.


More Telugu News