మధ్యప్రదేశ్ సంక్షోభం.. అలాంటి ఆసక్తి తమకు లేదన్న శివరాజ్‌సింగ్ చౌహాన్
- కమల్‌నాథ్ ప్రభుత్వాన్ని కూలదోసే ఉద్దేశం మాకు లేదు
- ఆ సంక్షోభం కాంగ్రెస్ అంతర్గత విషయం
- దాని గురించి నేను మాట్లాడబోను
మధ్యప్రదేశ్‌లో తలెత్తిన రాజకీయ సంక్షోభంపై బీజేపీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ స్పందించారు. కాంగ్రెస్‌లోని ప్రస్తుత పరిస్థితులు ఆ పార్టీ అంతర్గత వ్యవహారమని, దానిపై తాను మాట్లాడలేనని తేల్చి చెప్పారు. కమల్‌నాథ్ ప్రభుత్వాన్ని కూల్చాలన్న ఆసక్తి తమకు లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే ఉద్దేశం తమకు లేదని తొలి రోజు నుంచే తాను చెబుతున్నట్టు గుర్తు చేశారు.
కాంగ్రెస్ సీనియర్ నేత జ్యోతిరాదిత్య సింధియా తన మద్దతుదారులైన 17 మంది ఎమ్మెల్యేలతో కనిపించకుండా పోవడంతో మధ్యప్రదేశ్‌లో రాజకీయ సంక్షోభం తలెత్తింది. ఆయన బీజేపీలో చేరబోతున్నారని, మంత్రి పదవి కూడా ఖాయమన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలతో కలిసి చౌహాన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారన్న వార్తలు హల్‌చల్ చేశాయి. ఈ నేపథ్యంలోనే చౌహాన్ కొద్దిసేపటి క్రితం స్పందించారు.