వైయస్ కుటుంబాన్ని ఎదిరించి నిలబడ్డ నేత.. ఇప్పుడు వైసీపీలో చేరేందుకు రెడీ అవుతున్నారు!
- కడప జిల్లాలో పార్టీని వీడుతున్న టీడీపీ నేతలు
- వైసీపీలో చేరబోతున్న సతీశ్ రెడ్డి
- ఈ నెల 13న ముహూర్తం ఖరారైనట్టు సమాచారం
కడప జిల్లాలో టీడీపీ పరిస్థితి రోజురోజుకూ బలహీనపడుతోంది. ఇప్పటికే వైసీపీలో చేరేందుకు మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి సిద్ధమయ్యారనే వార్తలు చర్చనీయాంశంగా మారాయి. తాజాగా, జిల్లాలోని మరో కీలక నేత సతీశ్ రెడ్డి ఫ్యాన్ కిందకు చేరేందుకు సిద్ధమయ్యారనే వార్తలు ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. వైసీపీలో చేరికకు సంబంధించి ఇప్పటికే చర్చలు పూర్తయ్యాయని సమాచారం. ఈ నెల 13న వైసీపీలో ఆయన చేరబోతున్నారని చెపుతున్నారు. తాడేపల్లిలో ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో సతీశ్ రెడ్డి వైసీపీ కండువా కప్పుకోబోతున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలో తన అనుచరులతో సతీశ్ రెడ్డి ఈరోజు భేటీ కానున్నారు.
కడప జిల్లాలో సతీశ్ రెడ్డికి దమ్మున్న నేతగా గుర్తింపు ఉంది. తొలి నుంచి కూడా వైయస్ కుటుంబాన్ని ఎదిరించి నిలబడ్డ నేతగా పేరుంది. దివంగత రాజశేఖరరెడ్డి, జగన్ లపై నాలుగు సార్లు పోటీ చేసి ఆయన ఓడిపోయారు. ఇప్పుడు ఆయన వైసీపీలో చేరనుండటం టీడీపీకి పెద్ద దెబ్బే అని చెప్పుకోవచ్చు.