తెలంగాణలో ఈ నెల 16 నుంచి ఒంటిపూట బడులు

  • వేసవి సందర్భంగా రాష్ట్రంలో ఒక్కపూట బడులు
  • ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు స్కూళ్లు
  • ఏప్రిల్ 23 నుంచి వేసవి సెలవులు
  • జూన్ 12న తిరిగి ప్రారంభం కానున్న పాఠశాలలు
తెలంగాణలో వేసవి దృష్ట్యా ఒంటిపూట బడులు నిర్వహించనున్నారు. ఈ నెల 16 నుంచి అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఒక్కపూట బడులు నిర్వహిస్తామని రాష్ట్ర పాఠశాల విద్యాకమిషనర్ చిత్రా రామచంద్రన్ వెల్లడించారు. ఏప్రిల్ 23 నుంచి వేసవి సెలవులు ఉంటాయని, జూన్ 12న పాఠశాలలు తిరిగి ప్రారంభం అవుతాయని వివరించారు. ఈ మేరకు ప్రకటన చేశారు. ఒంటిపూట బడుల సందర్భంగా పాఠశాలలు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరుగుతాయని, మధ్యాహ్న భోజనం అనంతరం విద్యార్థులను ఇళ్లకు పంపుతారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.


More Telugu News