మెగా హీరో కొత్త సినిమా లాంచ్ రేపే
- రెండు హిట్లు కొట్టేసిన సాయితేజ్
- త్వరలో రానున్న 'సోలో బ్రతుకే సో బెటర్'
- దేవ కట్టాతో సెట్స్ పైకి
చాలా కాలం పాటు సక్సెస్ కోసం ఎదురుచూసిన సాయితేజ్, 'చిత్రలహరి' సినిమాతో కాస్త ఊపిరిపీల్చుకున్నాడు. ఆ తరువాత చేసిన 'ప్రతిరోజూ పండగే' కూడా విజయాన్ని ఇచ్చింది. వసూళ్లపరంగా సాయితేజ్ 'హమ్మయ్య' అనుకునేలా చేసింది. ఈ రెండు విజయాలు దక్కిన సంతోషంలో ఆయన 'సోలో బ్రతుకే సో బెటర్' సినిమా చేస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ నేపథ్యంలోనే సాయితేజ్ మరో ప్రాజెక్టును పట్టాలెక్కిస్తున్నాడు. రేపు ఈ సినిమాను లాంచ్ చేస్తున్నారు. ఈ సినిమాకి దర్శకుడిగా దేవ కట్టా వ్యవహరించనున్నాడు. ఎమోషన్ తో సాగే పొలిటికల్ స్టోరీగా ఈ సినిమా సాగుతుందని చెబుతున్నారు. భగవాన్ - పుల్లారావు కలసి దీనిని నిర్మిస్తున్నారు. దర్శకుడిగా వెనుకపడిపోయిన దేవ కట్టాకి ఇది మంచి అవకాశమనే చెప్పాలి. ఈ సినిమాతో ఆయన హిట్ కొడతాడేమో చూడాలి. అలాగే సాయితేజ్ కి హ్యాట్రిక్ హిట్ పడుతుందేమో చూడాలి.