'టక్ జగదీశ్' కోసం రాజమండ్రిలో సందడి చేస్తున్న నాని

  • గతంలో నాని, శివ కాంబోలో 'నిన్నుకోరి'
  • తదుపరి సినిమాగా 'టక్ జగదీశ్'
  • నాయికలుగా రీతూవర్మ .. ఐశ్వర్య రాజేశ్
నాని తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'వి' సినిమా ముస్తాబవుతోంది. ఈ నెల 25వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఆ తరువాత సినిమాను ఆయన శివ నిర్వాణ దర్శకత్వంలో చేయనున్నాడు.  ఈ సినిమాకి 'టక్ జగదీశ్' అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమా 'పొల్లాచ్చి'లో తొలి షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. అక్కడ నాని - రీతూ వర్మ కాంబినేషన్లో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించారట.

తదుపరి షెడ్యూల్ ను రాజమండ్రిలో ఆరంభించారు. ఒకపాట .. ఒక యాక్షన్ ఎపిసోడ్ .. కొన్ని కీలకమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరించనున్నట్టు సమాచారం. సాహు గారపాటి .. హరీశ్ పెద్ది నిర్మిస్తున్న ఈ సినిమాలో, మరో కథానాయికగా ఐశ్వర్య రాజేశ్ కనిపించనుంది. గతంలో నాని - శివ నిర్వాణ కాంబినేషన్లో వచ్చిన 'నిన్నుకోరి' విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే.


More Telugu News