ఊరేగింపుగా మండపానికి పెళ్లి కొడుకు.. బేడీలు వేసి కటకటాల్లోకి పంపిన పోలీసులు
- ఓ హత్యాకాండలో వరుడు ప్రధాన నిందితుడు
- పెళ్లి చేసుకోబోతున్నట్టు సమాచారం
- అరెస్ట్‌తో ఆగిన పెళ్లి
చక్కగా ముస్తాబైన పెళ్లికొడుకు కారులో ఊరేగింపుగా పెళ్లి మండపానికి బయలుదేరాడు. విషయం తెలిసిన పోలీసులు ఊరేగింపు వద్దకు చేరుకుని అరదండాలు వేసి కటకటాల వెనక్కి పంపారు. ఒడిశాలోని కటక్ జిల్లాలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. ఢెంకనాల్ జిల్లాలోని తాలొబొరొకోట్ గ్రామానికి చెందిన యువకుడికి సమసర్‌పూర్ గ్రామానికి చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది.
కటక్ జిల్లాలోని అఠొగొడొ బీరోకిషోపూర్‌లోని శివాలయంలో నిన్న వీరి పెళ్లి జరగాల్సి ఉంది. వరుడు ఊరేగింపుగా పెళ్లి మండపానికి బయలుదేరాడు. గతంలో జరిగిన ఓ హత్యాకాండలో వరుడు ప్రధాన నిందితుడు. అతడి కోసం గాలిస్తున్న పోలీసులకు నిందితుడు పెళ్లి చేసుకోబోతున్నట్టు సమాచారం అందింది. వెంటనే ఊరేగింపు వద్దకు చేరుకున్న పోలీసులు వరుడికి అరదండాలు వేసి అక్కడి నుంచి తీసుకెళ్లారు. దీంతో పెళ్లి కాస్తా ఆగిపోయింది.