మార్కెట్లోకి నకిలీ హ్యాండ్​ శానిటైజర్లు.. కరోనాతో డిమాండ్​ పెరిగిన ఎఫెక్ట్​

  • ఢిల్లీ శివార్లలోని గురుగ్రామ్ లో 5 వేలకుపైగా నకిలీ శానిటైజర్ బాటిళ్లు పట్టివేత
  • ఇండస్ట్రియల్ ఆయిల్స్ తయారు చేసే కంపెనీ
  • కరోనా వచ్చినప్పటి నుంచి నకిలీ శానిటైజర్ల తయారీ మొదలు
అది హర్యానాలోని కంపెనీ. పరిశ్రమలకు అవసరమైన రకరకాల ఆయిల్స్ ను తయారు చేస్తూ ఉంటుంది. కరోనా వైరస్ ఎఫెక్ట్ తో కొన్ని రోజులుగా హ్యాండ్ శానిటైజర్లకు డిమాండ్ పెరిగిపోవడం, మార్కెట్లో కొరత రావడాన్ని క్యాష్ చేసుకుందామని చూసింది. నకిలీ హ్యాండ్ శానిటైజర్లను తయారు చేసి మార్కెట్లో వదలడం మొదలుపెట్టింది. దీనిపై సమాచారం అందుకున్న హర్యానా అధికారులు.. శుక్రవారం దాడులు చేసి దాని గుట్టు రట్టు చేశారు. ఐదు వేలకుపైగా నకిలీ హ్యాండ్ శానిటైజర్ బాటిళ్లను సీజ్ చేశారు.

పది రోజుల కిందే మొదలుపెట్టారు

హర్యానాలోని గురుగ్రామ్ శివార్లలోని ఓ ఫ్యాక్టరీపై ఆ రాష్ట్ర ఆహార, ఔషధ నియంత్రణ మండలి అధికారులు శుక్రవారం దాడులు చేశారు. వివరాలను ఆ శాఖ అధికారి రిపన్ మెహతా వెల్లడించారు.

‘‘ఈ కంపెనీ పరిశ్రమలకు సంబంధించిన ఆయిల్స్ ను తయారు చేస్తుంది. కేవలం పది రోజుల కిందటే హ్యాండ్ శానిటైజర్లు తయారు చేయడం మొదలుపెట్టింది. ఆల్కహాల్, మరో రసాయనాన్ని బకెట్లలో పోసి.. హ్యాండ్ శానిటైజర్ బాటిళ్లలో నింపుతున్నారు. మా దాడిలో ఐదు వేలకుపైగా బాటిళ్లను పట్టుకుని సీజ్ చేశాం” అని తెలిపారు. పూర్తి వివరాలను తర్వాత ప్రకటిస్తామని వెల్లడించారు.


More Telugu News