వేలాది కోళ్లను చంపేయాలని కేరళ ప్రభుత్వం ఆదేశాలు

  • కేరళలో ఓ వైపు కరోనా వైరస్ అలజడి
  • మరోవైపు బర్డ్ ఫ్లూ కేసులు అధికం
  • ప‌ర‌ప్ప‌న‌గ‌డిలో కోళ్లకు బ‌ర్డ్ ఫ్లూ  
కేరళలో ఓ వైపు కరోనా వైరస్ అలజడి సృష్టిస్తుండగా.. మరోవైపు బర్డ్ ఫ్లూ కేసులు పెరిగిపోతున్నాయి. ఇటీవలే కేరళలోని కొజికోడ్‌లో రెండు కోళ్ల ఫారాల్లో బర్డ్ ఫ్లూ వ్యాధి కనిపించడంతో వాటి ప్రభావిత ప్రాంతాలకు ఒక కిలోమీటరు పరిధిలో అన్ని కోళ్లను చంపేయాలని అధికారులు ఆదేశించడంతో వాటిని చంపేశారు.

తాజాగా, ప‌ర‌ప్ప‌న‌గ‌డిలో కోళ్లకు బ‌ర్డ్ ఫ్లూ సోకిన‌ట్లు గుర్తించారు. దీంతో ఆ కోళ్ల‌ను కూడా చంపేయాలని ప్ర‌భుత్వం ఆదేశాలు ఇచ్చింది. దీంతో మరోసారి వేలాది కోళ్లు బలి కానున్నాయి. కోళ్ల‌ను చంపేందుకు ప్ర‌భుత్వ అధికారులు ఇప్పటికే ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేశారు. ప‌ర‌ప్ప‌న‌గ‌డిలో ఉన్న అన్ని పౌల్ట్రీల్లో వైద్య సిబ్బంది కోళ్లను పరీక్షిస్తున్నారు. బ‌ర్డ్‌ఫ్లూ కేంద్ర బిందువైన ప్రాంతం నుంచి సుమారు కిలోమీటర్ దూరం వ‌ర‌కు ఉన్న అన్ని పౌల్ట్రీల్లో ఉన్న కోళ్ల‌ను చంపేయనున్నారు.


More Telugu News