కరోనా ఇలా రావొచ్చంటూ 20 పాయింట్లు చెప్పిన చంద్రబాబు!
- ఏం జాగ్రత్తలు తీసుకుంటున్నారంటూ సర్కారుపై ధ్వజం
- కరోనా పంజా విసిరితే ఏమీ చేయలేరని వ్యాఖ్యలు
- ముందు జాగ్రత్తలతోనే కట్టడి చేయాలని హితవు
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. కరోనా విషయంలో ఏం జాగ్రత్తలు తీసుకుంటున్నారంటూ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. కరోనా మహమ్మారి పంజా విసిరితే ఏమీ చేయలేరని, ఇలాంటి పరిస్థితుల్లో నియంత్రణ చర్యలు తీసుకోకుండా ఎన్నికల కోసం పాకులాడుతున్నారని మండిపడ్డారు. ఈ క్రమంలో కరోనా సోకేందుకు ఇలాంటి అవకాశాలు ఉన్నాయంటూ 20 పాయింట్లు వివరించారు.
అవేంటంటే....
అవేంటంటే....
- లిఫ్టు బటన్లు
- డోర్ బెల్స్
- న్యూస్ పేపర్
- పాల ప్యాకెట్లు
- కారు డోర్లు
- ఇంట్లో పనిమనుషులు
- పచ్చి కూరగాయలు, పండ్లు
- షాపు కౌంటర్లు
- ఆఫీసు లంచ్ రూమ్, వాష్ రూమ్, బాత్రూమ్ డోర్ హ్యాండిల్స్
- గార్డెన్ సీట్లు
- ఆట స్థలాలు
- పనిమనుషులు ఇంట్లో తాకే ప్రదేశాలు
- ఇంట్లోని డోర్ నాబ్ లు
- అమెజాన్ తదితర డెలివరీ బాయ్స్ అందించే ప్యాకెట్లు
- షాపుల్లోని ప్యాకెట్లు
- కరెన్సీ నోట్లు, నాణేలు
- ఊబెర్ క్యాబ్, ఆటోలు
- బస్, ట్రెయిన్ హ్యాండిళ్లు
- బూట్లు
- జుట్టు