‘కరోనా’ ఎఫెక్ట్​ తో తన పెళ్లి వాయిదా పడిందన్న వదంతులపై హీరో నిఖిల్​ స్పందన

  • ఎట్టి పరిస్థితుల్లోనూ మా పెళ్లి వాయిదా పడదు
  • పరిస్థితులు మెరుగుపడతాయని ఆశిస్తున్నా
  • ఒకవేళ విపత్కర పరిస్థితులు సంభవిస్తే.. గుడిలో అయినా సరే పెళ్లి చేసుకుంటా
‘కరోనా’ కారణంగా సినీ హీరో నిఖిల్, డాక్టరు పల్లవిల వివాహం వాయిదా పడిందంటూ వదంతులు హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై నిఖిల్ స్పందిస్తూ, ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లి వాయిదా పడదని తేల్చి చెప్పాడు. ఏప్రిల్ లో పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ, తన పెళ్లి జరుగుతుందని అన్నాడు. ఇప్పటికే తమ బంధువులకు, మిత్రులకు ఆహ్వానపత్రికలు అందజేయడం జరిగిందని, కన్వెన్షన్ హాల్ ను బుక్ చేసుకున్నామని చెప్పాడు. పరిస్థితులు మెరుగుపడతాయని ఆశిస్తున్నానని, ఒకవేళ, విపత్కర పరిస్థితులు సంభవిస్తే.. గుడిలో అయినా పెళ్లి చేసుకుంటాం తప్ప ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేశాడు.


More Telugu News