గుంటూరు పోలీసుల విచారణకు హాజరుకాము: టీడీపీ నేత బోండా ఉమ
- మాచర్లలో దాడి జరిగిన ఘటనపై పోలీసులు చర్యలు తీసుకోవట్లేదు
- ఇప్పటికీ బెదిరింపు కాల్స్ వస్తున్నాయి
- విచారణకు రావాలని మాకు నోటీసులు ఇస్తున్నారు
- గుంటూరు పోలీసులపై మాకు నమ్మకం లేదు
మాచర్లలో తమపై దాడి జరిగిన ఘటనపై పోలీసులు చర్యలు తీసుకోవట్లేదని, తమకు ఇప్పటికీ బెదిరింపు కాల్స్ వస్తున్నాయని టీడీపీ నేత బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. అమరావతిలో ఆయన ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ... తమపై దాడి చేయించిన పిన్నెల్లి, వెంకట్రామిరెడ్డిలపై పోలీసులు కేసులు నమోదు చేయలేదని తెలిపారు.
తమపై జరిగిన దాడి ఘటనలో అనామకులపై కేసులు పెట్టారని, దీనిపై విచారణకు రావాలని తమకు నోటీసులు ఇస్తున్నారని బోండా ఉమ చెప్పారు. గుంటూరు పోలీసులపై తనకు నమ్మకం లేదని, తాము విచారణకు హాజరుకాబోమని తెలిపారు. నోటీసుల పేరుతో పిలిచి హత్యకు కుట్ర చేశారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించిందని విమర్శించారు. గుంటూరు పోలీసులపై తమకు నమ్మకం లేదని, అక్రమ కేసులను పెడుతూ తమ పార్టీ నేతలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పారు.