ప్రాణాలు కాపాడితే ఆరోపణలా....?: టీడీపీ నేతలపై పోలీసు అధికారుల సంఘం ఆగ్రహం

  • ముందస్తు సమాచారం ఇస్తే రక్షణ కల్పించేవారమన్న పోలీసులు
  • సమాచారం ఇచ్చామని టీడీపీ నేతలు అనడం సమంజసం కాదని వ్యాఖ్యలు
  • ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే సహించేదిలేదంటూ ఆగ్రహం
ఇటీవల మాచర్లలో టీడీపీ నేతలు బోండా ఉమ, బుద్ధా వెంకన్నలపై వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటన పట్ల టీడీపీ నేతలపై పోలీసు అధికారుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. జిల్లాలో పర్యటించే ముందు నేతలు తమకు సమాచారం ఇస్తే, వారికి రక్షణ కల్పించే బాధ్యత తమపై ఉంటుందని పోలీసు అధికారుల సంఘం పేర్కొంది.

అయితే, పోలీసులకు ముందుగానే సమాచారం ఇచ్చామని బోండా ఉమ, బుద్ధా వెంకన్న చెప్పడం సమంజసం కాదని పోలీసు అధికారుల సంఘం నేత బాలమురళీకృష్ణ వ్యాఖ్యానించారు. మాచర్ల ఘటనలో నేతలను దాడి నుంచి సీఐ కాపాడారని వెల్లడించారు. నేతల ప్రాణాలు కాపాడేందుకు పోలీసు వాహనంలో తరలించామని చెప్పారు. ప్రాణాలు కాపాడిన పోలీసులపై టీడీపీ నేతలు అనవసర ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదని అన్నారు.


More Telugu News