బేకరీలో కరోనా వైరస్‌ కేక్‌లు...అచ్చంగా అదే రూపంలో అమ్మకం!

  • ‘కరోనా యాంటీ బాడీ ప్రాలైన్స్‌’ అని పేరు
  • జర్మనీలోని ఓ షాపు యజమాని టెక్నిక్‌
  • పడిపోతున్న వ్యాపారాన్ని నిలబెట్టుకునే ఎత్తుగడ
వ్యాపారానికి టెక్నిక్‌ ముఖ్యం. వినియోగదారులను ఆకట్టుకునేందుకు సందర్భానుసారం చర్యలు చేపట్టాలి. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా కరోనా గురించి తెలియని వారు అరుదు. చిన్న పిల్లాడిని అడిగినా చెబుతాడు. ఈ ‘కరోనా’ మాటనే తన వ్యాపారాన్ని లాభసాటి చేసుకునేందుకు ఉపయోగించుకుంటున్నాడో వ్యాపారి. అదెలాగంటారా...అయితే ఇది చదవండి. జర్మనీలోని ఎర్‌ఫర్ట్‌లో రోత్‌ అనే వ్యాపారి బేకరీ నడుపుతున్నాడు.

ఇటీవల కరోనా భయం వెంటాడుతుండడంతో బేకరీకి వచ్చే వినియోగదారుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. అమ్మకాలు పడిపోయి వ్యాపారం బాగాదెబ్బతింది. దీంతో వ్యాపారాన్ని నిలబెట్టుకునేందుకు ఏం చేయాలో అర్థంకాక తలపట్టుకున్న రోత్‌కు ఓ మంచి ఐడియా వచ్చింది. దాన్నే ఆచరణలో పెట్టాడు.

వినియోగదారులను ఆకట్టుకునేందుకు ‘కరోనా యాంటీ బాడీ ప్రాలైన్స్‌’ పేరుతో వైరస్‌ ఆకారంలో ఉన్న కేకులను తయారు చేసి అమ్మకానికి ఉంచాడు. రకరకాల రంగుల్లో ఆకట్టుకునేలా ఉన్న ఈకేకులను నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోతాయంటూ ప్రచారం చేస్తున్నాడు.

దేన్నయితే చూసి జనం భయపడిపోతున్నారో దాన్నే తినండంటూ ప్రచారం చేస్తూ పడేస్తున్న రూత్‌ వ్యాపార టెక్నిక్‌ చూసి ప్రత్యర్థులు నివ్వెరపోతున్నారు.


More Telugu News