కరోనా ఎఫెక్ట్.. భద్రాద్రిలో శ్రీరామనవమి ఉత్సవాలకు బ్రేక్!
- తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలం
- చలువ పందిళ్ల ఏర్పాట్ల నిలిపివేత
- ఎటువంటి ఆర్భాటం లేకుండా సీతారాముల కల్యాణం
శ్రీరామ నవమి ఉత్సవాలపైనా ‘కరోనా’ ప్రభావం పడింది. తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలంలో నిర్వహించాల్సిన శ్రీరామనవమి ఉత్సవాలకు బ్రేక్ పడింది. భద్రాద్రిలో చలువ పందిళ్ల ఏర్పాట్లను నిలిపివేశారు. ఎటువంటి ఆర్భాటం లేకుండా భద్రాద్రిలో సీతారాముల కల్యాణం నిర్వహించాలని దేవస్థానం నిర్ణయించినట్టు సమాచారం. భక్తులు కూడా తమ ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని సూచించారు. కాగా, వచ్చే నెల 2వ తేదీన శ్రీరామ నవమి. ఈ ఏడాది ఆలయ అర్చకుల ఆధ్వర్యంలోనే సీతారాముల కల్యాణం జరుగుతుందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నిన్న ప్రకటించారు.