శ్రీనగర్ లో 78 మంది క్వారంటైన్ కు తరలింపు
- లేహ్ నుంచి వచ్చినవారిని క్వారంటైన్ కు తరలింపు
- దేశంలో ఈరోజు 27 కొత్త కేసుల నమోదు
- 166కి చేరుకున్న మొత్తం కేసులు
మన దేశంలో ఈరోజు ఇప్పటి వరకు 27 కరోనా వైరస్ కొత్త కేసులు నమోదయ్యాయి. 11 వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి. కశ్మీర్ లోని శ్రీనగర్ లో 78 మందిని క్వారంటైన్ కు తరలించారు. వీరంతా లేహ్ నుంచి వచ్చినవారు కావడం గమనార్హం. మరోవైపు దేశ వ్యాప్తంగా కరోనా కేసులు 166కి చేరుకున్నాయి. కరోనా నేపథ్యంలో సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ పరీక్షలను వాయిదా వేశారు. మార్చి 31 వరకు పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు ఇండియన్ స్కూల్ సర్ఠిఫికెట్ ఎగ్జామినేషన్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ప్రకటించారు.