ఇంత జరుగుతుంటే నవ్వులాటా?: ఐఓసీపై షట్లర్ కశ్యప్ మండిపాటు
- అథ్లెట్లు శిక్షణ కొనసాగించాలన్న ఐఓసీ
- ఎక్కడ? ఎలా ట్రయినింగ్ కొనసాగించాలి?
- ఐఓసీ జోక్ చేస్తోందని ఆగ్రహం
దేశమంతా కరోనా భయాలతో స్తంభించిపోతున్న వేళ, అథ్లెట్లు అందరూ ఒలింపిక్స్ శిక్షణను కొనసాగించాలంటూ ఐఓసీ (ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ) సూచించడంపై భారత ఏస్ షట్లర్ కశ్యప్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. ఐఓసీ వ్యాఖ్యలు చూస్తుంటే, నవ్వులాటలా కనిపిస్తోందని మండిపడ్డాడు.
కరోనా వైరస్ కారణంగా అన్ని క్రీడా శిక్షణా కేంద్రాలనూ మూసివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని గుర్తు చేసిన కశ్యప్, అథ్లెట్లు ఇక ఎక్కడ ట్రయినింగ్ కొనసాగించాలని ఐఓసీ భావిస్తోందని ప్రశ్నించాడు. "ఎక్కడ? ఎలా? శిక్షణ చేపట్టాలి? ఐఓసీ ఏమైనా జోక్ చేస్తోందా" అని సెటైర్లు వేశాడు.