విజయ్ .. మురుగదాస్ .. 'తుపాకి 2'
- 2012లో వచ్చిన 'తుపాకి'
- సీక్వెల్ కి సన్నాహాలు
- విజయ్ తదుపరి చిత్రం ఇదే
విజయ్ కథానాయకుడిగా మురుగదాస్ 'కత్తి' .. 'తుపాకి' .. 'సర్కార్' సినిమాలు తెరకెక్కాయి. విభిన్నమైన కథాకథనాలతో రూపొందిన ఈ సినిమాలు, విజయ్ కెరియర్లో చెప్పుకోదగినవిగా నిలిచిపోయాయి. అలాంటి ఈ ఇద్దరి కాంబినేషన్లో మరో సినిమా రూపొందనున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే అది 'తుపాకి' సీక్వెల్ అనేది తాజా సమాచారం.
విజయ్ - మురుగదాస్ కాంబినేషన్లో 2012లో వచ్చిన 'తుపాకి' భారీ విజయాన్ని సాధించింది. ఆ సినిమాకి సీక్వెల్ చేయడానికి మురుగదాస్ రంగంలోకి దిగాడట. ఆల్రెడీ విజయ్ తో కథా చర్చలు జరిగినట్టుగా చెబుతున్నారు. 'తుపాకి' సినిమాను నిర్మించిన 'వి' క్రియేషన్స్ వారే సీక్వెల్ ను కూడా నిర్మించనున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి.