కరోనా ఎఫెక్ట్: సివిల్స్ ఇంటర్వ్యూలు వాయిదా!
- ఈనెల 23 నుంచి ఏప్రిల్ 3 వరకు షెడ్యూల్
- తేదీ ప్రకటించకుండా వాయిదా వేస్తున్నట్లు చెప్పిన యూపీఎస్సీ
- పదిహేను రోజుల తర్వాత పరిస్థితిని సమీక్షిస్తామని వెల్లడి
దేశంలో అత్యున్నత ప్రభుత్వ సర్వీసులైన సివిల్స్ ఇంటర్వ్యూలను యూపీఎస్సీ వాయిదా వేసింది. గత ఏడాది సెప్టెంబరు 29వ తేదీన నిర్వహించిన యూపీఎస్సీ-2019 మెయిన్స్ పరీక్షల్లో ఇంటర్వ్యూలకు అర్హత సాధించిన వారి వివరాలను ఈ ఏడాది జనవరి 15న వెల్లడించింది. వీరికి మార్చి 23వ తేదీ నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని ప్రకటించింది.
షెడ్యూల్ ప్రకారం సోమవారం నుంచి ఇంటర్వ్యూలు జరగాల్సి ఉంది. కానీ దేశవ్యాప్తంగా కరోనా భయం వెంటాడుతుండడంతో ఇంటర్వ్యూలను వాయిదా వేస్తున్నట్లు యూపీఎస్సీ ప్రకటించింది. అయితే తేదీలను ప్రకటించలేదు. పదిహేను రోజుల తర్వాత దేశంలో కరోనా వైరస్ ప్రభావంపై సమీక్షించిన అనంతరం తదుపరి నిర్ణయం తీసుకోనున్నట్లు ప్రకటించింది.