బీఎస్4 డిస్కౌంట్ల జాతర... భారీగా ధర తగ్గించిన హ్యుందాయ్
- బీఎస్4 రిజిస్ట్రేషన్లకు మార్చి 31తో ముగియనున్న గడువు
- డిస్కౌంట్లు ప్రకటిస్తున్న వాహన తయారీదారులు
- రూ.2.5 లక్షల వరకు ప్రయోజనాలు పొందవచ్చంటున్న హ్యుందాయ్!
దేశంలో ఓవైపు కరోనా విజృంభిస్తున్న సమయంలోనే బీఎస్4 డిస్కౌంట్ల పండుగ ముగింపు దశకు చేరుకుంటోంది. ఈ నెలాఖరుతో బీఎస్4 రిజిస్ట్రేషన్లకు గడువు ముగుస్తుండడంతో వాహన తయారీ సంస్థలు భారీ డిస్కౌంట్లు ప్రకటిస్తున్నాయి.
ఈ క్రమంలో వినియోగదారులను ఆకర్షించేందుకు హ్యుందాయ్ కూడా బంపర్ ఆఫర్లతో ముందుకొచ్చింది. వెర్నా, క్రెటా, టక్సన్, ఎక్సెంట్, శాంత్రో, గ్రాండ్ ఐ10, ఐ20 కార్ల మోడళ్లపై గరిష్టంగా రెండున్నర లక్షల రూపాయల వరకు బీఎస్4 ప్రయోజనాలు పొందవచ్చని ప్రకటించింది. ఆయా మోడళ్లను అనుసరించి ఈ తగ్గింపు వర్తిస్తుందని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.