తెలంగాణ సరిహద్దుల్లో చెక్‌ పోస్టులు...ఇతర రాష్ట్రాల వారి రాకకు బ్రేక్‌

  • అన్ని దారులు మూసివేసిన పోలీసులు
  • ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారితోనే సమస్య కావడంతో నిర్ణయం
  • మహారాష్ట్ర సరిహద్ధుల్లో ప్రత్యేక నిఘా
రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి ఉద్ధృతంగా ఉండడం, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారితోనే సమస్య ఏర్పడుతుండడంతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇతర రాష్ట్రాలతో సరిహద్ధు ఉన్న రోడ్లన్నింటిని మూసివేసింది. ఇతర ప్రాంతాల నుంచి ఎవరూ రాకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది.

ప్రధాన రహదారుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటుచేసి పోలీసులు నిఘా కొనసాగిస్తున్నారు. ఉమ్మడి అదిలాబాద్‌లో జిల్లాతో మహారాష్ట్రకు ఉన్న సరిహద్దు ప్రాంతాలపై మరింత నిఘా పెట్టారు. బాసర, ధర్మాబాద్‌ వద్ద అంతర్రాష్ట్ర సరిహద్దును మూసివేశారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాకు చెందిన 37 మంది ఇటీవల ఖతార్‌ నుంచి వచ్చారు. వీరంతా జహీరాబాద్‌ జిల్లా చిరాజ్‌పల్లి చెక్‌పోస్టు మీదుగా తెలంగాణలోకి ప్రవేశించే ప్రయత్నం చేయడంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 74కు చేరడంతో ప్రభుత్వం ఏ విషయంలోనూ రాజీపడడం లేదు.


More Telugu News