సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

  • మహేశ్ సినిమాలో కీర్తి సురేశ్ 
  • కాజల్ కి మరో భారీ ఆఫర్ 
  • నిఖిల్ సరసన అనూ ఇమ్మానుయేల్
 *  మహేశ్ బాబు తన తదుపరి చిత్రాన్ని పరశురాం దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. కరోనా వైరస్ కలకలం తగ్గిన తర్వాత ఈ చిత్రం షూటింగ్ మొదలవుతుంది. కాగా, ఇందులో హీరోయిన్ పాత్రకు కీర్తి సురేశ్ ను తీసుకోవలసిందిగా మహేశ్ దర్శక నిర్మాతలకు సూచించినట్టు తెలుస్తోంది.
*  ప్రస్తుతం తెలుగులో చిరంజీవి సరసన 'ఆచార్య' చిత్రంలో నటిస్తున్న కాజల్ అగర్వాల్ కు తమిళం నుంచి మరో పెద్ద ఆఫర్ వచ్చింది. మురుగదాస్ దర్శకత్వంలో విజయ్ హీరోగా రూపొందే చిత్రం కోసం కాజల్ తో సంప్రదింపులు జరుగుతున్నట్టు సమాచారం.
*  'అర్జున్ సురవరం' తర్వాత నిఖిల్ తన తదుపరి చిత్రాన్ని సుకుమార్, గీతా ఆర్ట్స్ కలసి నిర్మించే చిత్రంలో నటిస్తున్నాడు. సూర్యప్రతాప్ దర్శకత్వం వహించే ఈ చిత్రంలో అనూ ఇమ్మానుయేల్ ను తీసుకుంటున్నారట.


More Telugu News