ఆర్‌బీఐ నిర్ణయం అభినందనీయం: జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌

  • రుణ చెల్లింపులపై మారటోరియం మంచి నిర్ణయం
  • సన్న, చిన్న, మధ్యతరహా పరిశ్రమల నిర్వాహకులకు ఉపయుక్తం
  • సంక్షోభ సమయంలో ఈ నిర్ణయం తీసుకున్నందుకు ధన్యవాదాలు
లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రజల ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తీసుకున్న నిర్ణయం అభినందనీయమని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ అన్నారు. అన్నిరకాల రుణాల చెల్లింపుపై మూడు నెలల మారటోరియం విధిస్తూ ఆర్‌బీఐ ప్రకటన చేసిన కొద్దిసేపటికి ఆయన ట్విట్టర్‌ ద్వారా స్పందించారు. ఈ నిర్ణయం సన్న, చిన్న, మధ్య తరహా పరిశ్రమల నిర్వాహకులకు ఎంతో మేలు చేస్తుందని అన్నారు. నగదు క్రెడిట్‌, ఓవర్‌ డ్రాఫ్ట్‌ రూపంలో చెల్లింపులు వాయిదాకు అనుమతించడం లాభదాయకమన్నారు. ఇటువంటి సంక్షోభ సమయంలో ప్రజలకు ఎంతో భరోసానిచ్చే అంశం ఇదని పేర్కొన్నారు.


More Telugu News