కరోనాపై పోరాటానికి భారత్‌కు అమెరికా సాయం

  • 64 దేశాలకు అదనంగా 174 మిలియన్‌ డాలర్ల నిధులు
  • ఇందులో భారత్‌కు రూ.21 కోట్లు కేటాయింపు
  • ఇదివరకే వంద మిలియన్ డాలర్ల ప్యాకేజీ ప్రకటించిన అగ్రరాజ్యం
కరోనా వైరస్‌ను తరిమికొట్టేందుకు భారత్‌కు అగ్రరాజ్యం అమెరికా రూ. 21 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించింది. వైరస్‌పై పోరాటంలో భాగంగా 64 దేశాలకు అమెరికా అదనంగా మరో  174 మిలియన్‌ డాలర్ల నిధులు అందజేస్తున్నట్టు శనివారం  తెలిపింది. ఇందులో భాగంగా భారత్‌కు 2.9 మిలియన్ డాలర్లు (దాదాపు రూ 21 కోట్లు) కేటాయించింది. కరోనా కట్టడికి అగ్రరాజ్యం ఇప్పటికే  వంద మిలియన్ డాలర్ల ప్యాకేజీ ప్రకటించింది. తాజాగా మరింత కేటాయించింది.

కరోనాను ఎదుర్కొనేందుకు దేశ వైద్య రంగానికి ప్రధాని మోదీ రూ. 15 వేల కోట్ల నిధులు ఇస్తున్నట్టు తెలిపారు. ఈ మొత్తాన్ని అదనపు ఐసోలేషన్ వార్డుల ఏర్పాటుకు, ఐసీయూ బెడ్స్, మెడికల్ బెడ్స్, మెడికల్, పారా మెడికల్ వైద్య సిబ్బంది కోసం ఖర్చు చేస్తామని తెలిపారు.


More Telugu News