తెలుగు యాత్రీకులను ఆదుకోండి : యూపీ సీఎంను కోరిన నారా లోకేష్

  • తీర్థయాత్రకు వెళ్లి వారణాసిలో చిక్కుకున్నారు 
  • అక్కడి నటరాజన్ హెటల్ లో సహాయం కోసం ఎదురుచూపు 
  • ట్విట్టర్ లో ఫోన్ నంబర్లతో సహా మేసేజ్ పంపిన లోకేష్

లాక్ డౌన్ కు ముందు తీర్థయాత్రల కోసం వారణాసి వచ్చి అక్కడ చిక్కుకుపోయిన తెలుగు యాత్రీకులను ఆదుకోవాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను కోరారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన మొత్తం 34 మంది వారణాసి సందర్శనకు వచ్చారని, ఈలోగా లాక్ డౌన్ ప్రకటించడంతో అక్కడ చిక్కుకుపోయారని ట్విట్టర్ ద్వారా లోకేష్ వెల్లడించారు. ప్రస్తుతం వీరంతా వారణాసిలోని నటరాజన్ లాడ్జిలో ఉన్నారని, సహాయం కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. మానవతా దృక్పథంతో వారిని ఆదుకోవాలని యూపీ సీఎంను కోరారు. ఈ మేరకు ట్విట్టర్‌లో లోకేష్ బాధితుల వివరాలు, ఫోన్ నంబర్లను అందజేశారు.



More Telugu News