పాతికవేల మంది బ్యాంకు అకౌంట్ వివరాలు తీసుకున్న సల్మాన్ ఖాన్

  • కరోనా ప్రభావంతో భారత్ లో లాక్ డౌన్
  • మూతపడిన బాలీవుడ్
  • ఉపాధి కోల్పోయిన లక్షల మంది కార్మికులు
  • వారిలో 25 వేల మంది ఇబ్బందుల్లో ఉన్నారని తెలుసుకున్న సల్మాన్
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఉదారస్వభావం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సల్మాన్ వ్యక్తిగత జీవితంలో కొన్ని చేదు సంఘటనలు ఉన్నా, అంతకుమించిన దాతృత్వంతో లెక్కలేనంతమంది అభిమానులకు దగ్గరయ్యారు. తాజాగా కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో తన ఛారిటీ సంస్థ బీయింగ్ హ్యూమన్ ఫౌండేషన్ ద్వారా సినీ కార్మికులను ఆదుకునేందుకు సిద్ధమయ్యారు.

బాలీవడ్ షట్ డౌన్ కావడంతో ఐదు లక్షల మంది కార్మికులకు ఉపాధి నిలిచిపోయింది. వారిలో 25 వేల మందికి తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని తెలుసుకున్న సల్మాన్ ఖాన్ తన బీయింగ్ హ్యూమన్ ఫౌండేషన్ ను రంగంలోకి దింపారు. బీయింగ్ హ్యూమన్ ప్రతినిధులు ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియన్ సినీ ఎంప్లాయీస్ (ఎఫ్ డబ్ల్యూఐసీఈ) కార్యాలయానికి వచ్చి ఆ పాతికవేల మంది కార్మికుల బ్యాంక్ అకౌంట్ వివరాలు తీసుకున్నారు. వారి ఖాతాల్లోకి నేరుగా డబ్బు బదిలీ చేయాలన్నది సల్మాన్ ఆలోచన. ఆ పాతికవేల మంది యోగక్షేమాలు లాక్ డౌన్ ఉన్నన్నాళ్లు బీయింగ్ హ్యూమన్ ఫౌండేషన్ చూసుకోనుంది.


More Telugu News