సామాజిక దూరం పాటించని మటన్ షాపు.. రూ. 5 వేల జరిమానా విధించిన జీహెచ్ఎంసీ
- మాస్కులు, గ్లౌజులు ధరించకుండా విక్రయాలు
- సామాజిక దూరం గాలికి
- మరో ఘటనలో ముగ్గురిపై కేసు నమోదు
కరోనా వైరస్ ఓ వైపు ప్రజల్ని భయకంపితుల్ని చేస్తున్నా సామాజిక దూరం పాటించకుండా, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా మాంసం విక్రయించిన దుకాణంపై జీహెచ్ఎంసీ అధికారులు కొరడా ఝళిపించారు. హైదరాబాద్ బోరబండ ప్రధాన రహదారిపై స్వామి రామానందతీర్థ నగర్‌లోని రహీం మటన్ దుకాణంలో నిన్న మాంసం విక్రయాలు జోరందుకున్నాయి. ఆదివారం కావడంతో మటన్ ప్రియులు పోటెత్తారు.
అయితే, సామాజిక దూరం నిబంధనను గాలికి వదిలేయడంతోపాటు మాస్కులు, గ్లౌజులు ధరించకుండా విక్రయాలు జరిపినందుకు సదరు షాపు ఓనరుకు జీహెచ్ఎంసీ అధికారులు రూ. 5 వేల జరిమానా విధించారు. మరో ఘటనలో నేరేడ్‌మెట్ చౌరస్తాలో లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించి ఒకే చోట గుమికూడిన ముగ్గురిపై స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.