మా తరంలో ఆ ఇద్దరే అత్యుత్తమ బ్యాట్స్‌మెన్: షేన్ వార్న్

  • సచిన్, లారా తర్వాతే ఎవరైనా
  • టెండూల్కర్ ఎలాంటి పరిస్థితుల్లో అయినా రాణిస్తాడు
  • భారీ లక్ష్య ఛేదనలో నా ఓటు లారాకే: వార్న్
తమ తరంలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, వెస్టిండీస్ లెజెండరీ క్రికెటర్ బ్రియాన్ లారా ఇద్దరే అత్యుత్తమ బ్యాట్స్‌మెన్ అని ఆస్ట్రేలియా స్పిన్ మాంత్రికుడు షేన్ వార్న్ మరోసారి కితాబిచ్చాడు. ఏ పరిస్థితుల్లోనైనా రాణించే ఆటగాడు సచిన్‌ అని అన్నాడు. అలాగే, విధ్వంసకర బ్యాటింగ్ చేయాలంటే లారాను ఎన్నుకుంటానని వార్న్ తెలిపాడు.

‘బ్యాటింగ్‌లో ఈ ఇద్దరి తరువాతే ఎవరైనా. ఉత్తమ బ్యాట్స్‌మెన్‌ను ఎంపిక చేయమంటే సచిన్, లారా మధ్య నిజమైన పోటీ ఉంటుంది. అయితే ఏ పరిస్థితుల్లోనైనా రాణించాలంటే టెండూల్కర్ పేరు చెబుతా. చివరి రోజు 400 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాల్సిన సమయంలో నేను లారాను ఎంచుకుంటాా’ అని ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లో అభిమానులు అడిగిన ప్రశ్నకు వార్న్ సమాధానం ఇచ్చాడు.


More Telugu News