జనగామలో భయం భయం.. నిజాముద్దీన్ నుంచి వచ్చి ఊరంతా తిరిగిన ముగ్గురు వ్యక్తులు
- జిల్లా నుంచి మర్కజ్ మసీదుకు వెళ్లిన ఐదుగురు
- తిరిగొచ్చిన ముగ్గురిలో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు
- సికింద్రాబాద్, వరంగల్ ఆసుపత్రులకు తరలించిన అధికారులు
తెలంగాణలోని జనగామ జిల్లా వాసులు ఇప్పుడు భయంభయంగా గడుపుతున్నారు. ఢిల్లీ నిజాముద్దీన్‌లోని మర్కజ్ మసీదు ప్రార్థనలకు వెళ్లివచ్చిన వారిలో ముగ్గురు ఊరంతా కలియదిరగడమే ఇందుకు కారణం. జనగామతోపాటు జిల్లాలోని వెల్దండకు చెందిన ఐదుగురు వ్యక్తులు గత నెల 15న నిజాముద్దీన్ వెళ్లారు. వీరిలో ఇద్దరు ఢిల్లీలోనే ఉండిపోగా ముగ్గురు మాత్రం మార్చి 17న విమానంలో హైదరాబాద్ చేరుకుని అక్కడి నుంచి స్వగ్రామాలకు చేరుకున్నారు.
ఢిల్లీ నుంచి వచ్చిన ముగ్గురిలో ఒకరు ప్రభుత్వ ఉపాధ్యాయుడు కాగా, మరొకరు జిల్లా గ్రామీణాభివృద్ధి కార్యాలయ ఉద్యోగి అని తేలింది. మరొకరు ప్రైవేటు ఉద్యోగి. వీరు ఢిల్లీ వెళ్లి వచ్చినట్టు ముందే సమాచారం అందుకున్న అధికారులు వివరాలు ఆరా తీయగా తాము ఢిల్లీ వెళ్లలేదని బుకాయించినట్టు తెలుస్తోంది. అయితే, వీరు ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత హోం క్వారంటైన్‌లో ఉండకుండా ఊరంతా తిరిగినట్టు తెలియడంతో ఆందోళన నెలకొంది. జనగామకు చెందిన ఇద్దరినీ వరంగల్ ఎంజీఎంకు తరలించిన అధికారులు, వారి కుటుంబ సభ్యులను హోం ఐసోలేషన్‌లో ఉంచారు. వెల్దండకు చెందిన మరో వ్యక్తి, అతడి కుటుంబ సభ్యులను సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు.