వేడి నీళ్లతో స్నానం చేయండి.. హృద్రోగాలు, పక్షవాతానికి దూరంగా వుండండి: జపాన్‌ పరిశోధకులు

  • 30 వేల మందిపై 20 ఏళ్ల పాటు అధ్యయనం 
  • హృద్రోగాల ముప్పు 28 శాతం తగ్గే అవకాశం
  • పక్షవాత ముప్పు 26 శాతం తగ్గుతుందని గుర్తింపు
హృద్రోగాలు, పక్షవాతం దరిచేరకుండా ఉండేందుకు ఎన్నో రకాల వ్యాయామాలు చేస్తుంటాం. ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకుంటాం. అయితే, చాలా సులువైన చిన్న చిట్కాతో హృద్రోగాల ముప్పును 28 శాతం తగ్గించుకోవచ్చని జపాన్‌ శాస్త్రవేత్తలు అంటున్నారు. ప్రతి రోజు గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయడం వల్ల గుండె జబ్బులతో పాటు పక్షవాతం బారిన పడే ప్రమాదం కూడా తక్కువగా ఉంటుందని తేల్చారు.

సుమారు 30 వేల మందిపై 20 ఏళ్ల పాటు అధ్యయనం చేసి ఈ విషయాన్ని గుర్తించారు. గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏరోబిక్స్‌ చేయడం వల్ల కలిగే ఫలితాలతో సమానమని తెలిపారు. చన్నీళ్లతో స్నానం చేసే వ్యక్తులతో పోల్చితే గోరువెచ్చని నీళ్లతో స్నానం చేసే వారిలో పక్షవాత ప్రమాదం కూడా 26 శాతం తక్కువని తేల్చారు.


More Telugu News