సెల్‌ఫోన్ టార్చ్‌లను ఆకాశంలోకి చూపిస్తే కరోనా పోతుందా?: రాహుల్ గాంధీ

  • కరోనా తీవ్రతపై ప్రధాని సరిగా స్పందించడం లేదు
  • చప్పట్లు కొట్టడం, లైట్లు వెలిగించడం కరోనా నివారణ మార్గాలు కావు
  • ప్రణాళిక లేకుండా ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు
నేటి రాత్రి దేశ ప్రజలందరూ ఇళ్లలోని విద్యుత్ లైట్లను ఆర్పివేసి దీపాలు వెలిగించాలన్న ప్రధాని నరేంద్రమోదీ పిలుపుపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. చప్పట్లు కొట్టడం, దీపాలు వెలిగించడం ద్వారా తీవ్రమైన సమస్యను ఎలా పరిష్కరిస్తారని ప్రశ్నించారు. దీపాలు వెలిగించడం, లైట్లు ఆర్పి సెల్‌ఫోన్ టార్చ్‌లను ఆకాశంలోకి చూపించడం వంటివి కరోనా వైరస్‌ను అడ్డుకునే మార్గాలు కావని రాహుల్ అన్నారు.

ప్రభుత్వం వద్ద ముందస్తు ప్రణాళిక అంటూ ఏదీ లేదని దుయ్యబట్టారు. కరోనా మహమ్మారి విషయంలో ప్రధాని అంతగా స్పందించడం లేదన్నారు. దేశంలో ఇప్పటి వరకు సరిపడా కరోనా నిర్ధారిత పరీక్షలు చేయలేదని రాహుల్ ఆరోపించారు. ప్రభుత్వం తీరుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రాహుల్ మండిపడ్డారు.


More Telugu News