"మేమూ వెలిగించాం దీపాలు" అంటున్న ప్రముఖులు... ఫొటోలు చూడండి!
- కరోనాపై భారత్ ఐక్యపోరాటం
- ప్రధాని పిలుపుతో లైట్లు ఆర్పి దీపాలు వెలిగించిన యావత్ భారతం
- పాలుపంచుకున్న సెలబ్రిటీలు
ఆదివారం రాత్రి 9 గంటలకు ప్రారంభమైన దీప యజ్ఞం 9 నిమిషాల పాటు సాగి యావత్ భారతాన్ని ఏకం చేసింది. స్థాయి భేదం లేకుండా ప్రతి ఒక్కరూ లైట్లు ఆర్పి, దీపాలు, కొవ్వొత్తులు వెలిగించి ప్రధాని నరేంద్ర మోదీ ఉద్దేశాన్ని నెరవేర్చారు. కరోనా మహమ్మారిపై పోరాటంలో భారత్ ఏకతాటిపై నిలుస్తుందని చాటుదాం అని మోదీ ఇచ్చిన పిలుపుకు ప్రజానీకం అద్భుతంగా స్పందించింది. ఈ సాయంత్రం నుంచే ఇళ్లలో సన్నాహాలు మొదలుపెట్టిన ప్రజలు, సరిగ్గా 9 గంటలు కాగానే లైట్లు ఆర్పి దీపాలు, కొవ్వొత్తులను వెలిగించి ఆ వెలుగులతో భారతీయతను సగర్వంగా చాటారు.
ఈ క్రతువులో ప్రముఖులు సైతం విశేషంగా పాలుపంచుకుని స్ఫూర్తిని ప్రదర్శించారు. మెగాస్టార్ చిరంజీవి తన కుటుంబసభ్యులతో కలిసి మోదీ పిలుపును ఆచరించారు. మహేశ్ బాబు, రజనీకాంత్, మోహన్ బాబు, వెంకటేశ్, తమన్నా తదితరులు దీపాలు, కొవ్వొత్తుల చేతబట్టి దేశభక్తిని చాటారు. అటు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన అర్ధాంగి అనుష్కతో కలిసి దీపాలు ప్రజ్వలింపచేశాడు.