కొన్ని మినహాయింపులతో లాక్‌డౌన్ ను 2 వారాలు పొడిగించాలి: మోదీకి పంజాబ్ సీఎం సూచన
- కొనసాగుతున్న వీడియో కాన్ఫరెన్స్
- ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లు అందించాలన్న అమరీందర్ సింగ్
- పరిశ్రమలు, వ్యవసాయ రంగాలను లాక్‌డౌన్ నుంచి మినహాయించాలి
లాక్‌డౌన్‌ను పొడిగించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ కోరారు. దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోన్న నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ ఎత్తివేతపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్‌లో కీలక చర్చలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో పలువురు ముఖ్యమంత్రులు లాక్‌డౌన్ పొడిగింపుపై తమ అభిప్రాయాలు తెలుపుతున్నారు.
ఈ నేపథ్యంలో అమరీందర్ సింగ్ మాట్లాడుతూ... 'దేశ వ్యాప్తంగా కనీసం రెండు వారాలయినా లాక్‌డౌన్ పొడిగించాలి. అయితే, పరిశ్రమలు, వ్యవసాయ రంగాలకు దీని నుంచి వెంటనే మినహాయింపును ఇవ్వాలి' అని కోరారు. అలాగే, దేశంలో కరోనా బాధితులను గుర్తించడానికి ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లను వేగవంతంగా సరఫరా చేయాలని చెప్పారు.
మోదీతో మాట్లాడుతూ లాక్‌డౌన్ ఎత్తివేతపై పలు రాష్ట్రాల సీఎంలు పలు సూచనలు చేశారు. చాలా రాష్ట్రాల ముఖ్యమంత్రులు లాక్‌డౌన్‌ను పొడిగించాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్ ఎత్తివేతపై మోదీ తీసుకునే నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.