చేతకాదని ఒప్పుకోండి.. అప్పుడు చంద్రబాబు వచ్చి చూపిస్తారు: అచ్చెన్నాయుడు
- పూలే స్ఫూర్తితో ఆవిర్భవించిన పార్టీ టీడీపీ
- బీసీలకు టీడీపీని వెన్నెముకలా నిలిపాం
- జగన్ ప్రభుత్వ అన్యాయాలపై పోరాడతాం
దమ్ముంటే హైదరాబాదు నుంచి వచ్చి మాట్లాడాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబుకు సవాల్ విసురుతున్న వైసీపీ నేతలపై అచ్చెన్నాయుడు మండిపడ్డారు. స్వార్థ ప్రయోజనాల కోసం లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తున్న మీరు, మీ మంత్రులు చంద్రబాబుకు దమ్ముంటే హైదరాబాదు నుంచి రమ్మంటున్నారని... పాలన చేతకాదని బేషరతుగా ఒప్పుకుంటే... చంద్రబాబు వచ్చి పాలన అంటే ఏమిటో చూపిస్తాడని అన్నారు.
'కులవివక్షపై పోరాడాలంటే విద్యే మార్గమని ఆలోచించి ఆచరణలో పెట్టిన అణగారిన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిరావ్ పూలే స్ఫూర్తితో ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీ నేటివరకూ రాజ్యాధికారంలో భాగమయ్యేలా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రజాప్రతినిధులకు కీలక పదవులు కట్టబెట్టింది.
ఎన్నికల్లో బీసీలకు 1987 నుంచి 27%, 1995 నుంచి 34% రిజర్వేషన్లు కల్పించింది. మా ఐదేళ్ల పాలనలో బీసీలకు రూ. 46 వేల కోట్ల బడ్జెట్ ఇచ్చాం. `ఆదరణ` కింద 2.55 లక్షల మంది చేతి వృత్తుల వారికి పనిముట్లు అందజేశాం. బీసీ కులాలకు ఫెడరేషన్లు, ప్రత్యేక ఫైనాన్స్ కార్పొరేషన్లు ఏర్పాటు చేశాం.
99,390 మందికి స్వయం ఉపాధి యూనిట్లు మంజూరు చేశాం. బీసీలకు వెన్నెముకగా టీడీపీని నిలిపాం. అణగారిన వర్గాలకు ప్రస్తుత జగన్‌రెడ్డి ప్రభుత్వం చేస్తున్న అన్యాయంపై పోరాడతాం. మహాత్మ పూలే ఆశయసాధనకు కృషి చేయడమే ఆయన జయంతి సందర్భంగా మనమిచ్చే ఘననివాళి' అని అచ్చెన్నాయుడు ట్వీట్ చేశారు.