15 రాష్ట్రాల్లోని 25 జిల్లాల్లో కొత్త కేసులు నిల్.. ఫలిస్తున్న చర్యలు!
- మొదట ఆయా జిల్లాల్లో కరోనా వ్యాప్తి
- పటిష్ఠ చర్యలు తీసుకున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
- జాబితాలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
దేశంలో కరోనా వైరస్ కట్టడి కోసం కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలు ఫలితాలు ఇస్తున్నాయి. తొలుత కరోనా కేసులు నమోదైన 15 రాష్ట్రాల్లోని 25 జిల్లాలు.. వైరస్ వ్యాప్తిని అడ్డుకున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ చెప్పింది. అక్కడ గత 14 రోజుల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదని తెలిపింది. ఈ 25 జిల్లాల్లో తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం కూడా ఉందని చెప్పింది.
దేశంలో మరో ఆరు వారాల వరకు టెస్టులు నిర్వహించేందుకు అవసరమైన స్టాక్ ఉందని, ఇప్పటిదాకా 2 లక్షలకు పైగా శాంపిల్స్ పరీక్షించామని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కోర్ స్ట్రాటజీ గ్రూప్.. ర్యాపిడ్, ఎకనామికల్ డయాగ్నస్టిక్స్, కొత్త డ్రగ్స్‌పై పని చేస్తోందని తెలిపారు. ఇక, దేశ వ్యాప్తంగా ఇప్పటిదాకా 2,06,212 టెస్టులు చేశామని ఐసీఎంఆర్ అధికారులు తెలిపారు.